ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం సభ్యులు — నూతన అధ్యక్షుడికి నాయకుల అభినందనలు
యాదవ సంఘం బలోపేతానికి, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి
మంథని, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా పర్షవేన మోహన్ యాదవ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మంథని పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల యాదవ సంఘం సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంజన సందనవేన రాజేందర్ యాదవ్, జిల్లా నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, పర్షవేన బకన్నయ్య యాదవ్, ఉడుత పర్వతాలు యాదవ్ తదితరులు మోహన్ యాదవ్కు అభినందనలు తెలిపారు.
యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. సంఘ సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ సమాజ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పర్షవేన మోహన్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులు, సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మంథని మండలంలోని యాదవుల అభివృద్ధి, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సంఘ నాయకులు, సభ్యుల సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మోహన్ యాదవ్ తెలిపారు.










Leave a Reply