తెలంగాణలో పలు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లలో TGSAFE అధికారుల తనిఖీలు
హైదరాబాద్: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణ వ్యాప్తంగా పలు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లలో TGSAFE అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. మాదాపూర్‌లోని మానెస్టరీ ఆంఫీ బ్రూవరీ, వరంగల్‌లోని అల్ఫారామ్ హోటల్, కామారెడ్డిలోని మాల్గుడి రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన పచ్చి నాన్‌వెజ్ మాంసం, ఫ్రీజర్లలో నిల్వ చేసిన వండిన ఆహారం, సరైన లేబుల్స్ లేని ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే సుమారు 5 కిలోల మళ్లీ ఉపయోగించిన వంట నూనెను గుర్తించినట్లు సమాచారం.
లేబుల్ లేని సింథటిక్ ఫుడ్ కలర్, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పగిలిన గుడ్లను కూడా తనిఖీల్లో గుర్తించారు.
ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వరంగల్‌లోని అల్ఫారామ్ హోటల్‌కు అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply