సన్న బియ్యం పేదలకు వరం: మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు
దేవరకొండ, సెప్టెంబర్ 17: దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న షాప్ నంబర్ 62 రేషన్ దుకాణంలో గురువారం రేషన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ స్మార్ట్ కార్డులను మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు.
రేషన్ డీలర్ మల్లికార్జున్, 5వ వార్డు కౌన్సిలర్ నేనావత్ శ్రీకన్య సేవ్య నాయక్‌తో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు సన్న బియ్యాన్ని అందించడంతో పాటు రేషన్ స్మార్ట్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.
గతంలో రేషన్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారని, వాటిని వినియోగించలేక కొందరు లబ్ధిదారులు విక్రయించే పరిస్థితి ఉండేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేయడం పేదలకు ఉపయోగకరంగా మారిందని అన్నారు.
ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ నేనావత్ శ్రీకన్య సేవ్య నాయక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఏఈ రాజు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, రేషన్ డీలర్ మల్లికార్జున్, రేషన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply