Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › లిటిల్‌ ఫ్లవర్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

లిటిల్‌ ఫ్లవర్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో అంబరాన్నంటిన కృష్ణాష్టమి వేడుకలు

01:53 తెల్లవారుజాము AM

రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారుల సందడి.. ఉత్సాహంగా ఉట్టి కొట్టిన విద్యార్థులు

గోకులాన్ని తలపించిన పాఠశాల ఆవరణ.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

దేవరకొండ, సెప్టెంబర్‌ 4 | అయుష్ 24 న్యూస్

గోకులంలో శ్రీకృష్ణుడి అల్లరిని తలపించేలా.. గోపికల కోలాహలంతో.. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారుల సందడితో దేవరకొండ పట్టణంలోని లిటిల్‌ ఫ్లవర్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఉట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో ముస్తాబై వేడుకల్లో పాల్గొన్నారు. యశోదమ్మ చిన్నికృష్ణుడికి వెన్న తినిపించే సన్నివేశాలు, గోపికలు పాల కుండలు తీసుకురావడం, ఉట్టి కొట్టే సమయంలో చిన్నికృష్ణుడిని ఆటపట్టించే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తల్లిదండ్రులు తమ పిల్లలను అందంగా రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబు చేసి పాఠశాలకు తీసుకురావడంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటూ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. చిన్నారుల వేషధారణలు, ఆటపాటలు, ఉట్టి కార్యక్రమంతో పాఠశాల ఆవరణం అచ్చం గోకులాన్ని తలపించింది.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ చేరిపల్లి రాజేష్‌ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇదే తరహాలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు పాఠశాల స్థాయి నుంచే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యత, దేశభక్తి, క్రమశిక్షణ, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం వంటి విలువలను బోధిస్తున్నామని పేర్కొన్నారు.

భారతీయ పండుగల్లో శ్రీకృష్ణాష్టమి చిన్నారులను ప్రత్యేకంగా ఆకట్టుకునే పండుగ అని, రాధాకృష్ణుల వేషధారణలో పిల్లలను చూడటం తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. విద్యార్థుల కేరింతలు, తల్లిదండ్రుల ఆనందం మధ్య వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 240🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
0 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *