Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › తాజా వార్తలు › ల్యాబ్ టెక్నీషియన్ల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం: పి. వీరయ్య
తాజా వార్తలు

ల్యాబ్ టెక్నీషియన్ల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం: పి. వీరయ్య

03:47 మధ్యాహ్నం PM

హైదరాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశం

జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపు

హైదరాబాద్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ప్రతినిధి): ల్యాబ్ టెక్నీషియన్లు ఒకే వేదికపై ఐక్యంగా ముందుకు వస్తేనే అసోసియేషన్ మరింత బలోపేతమవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు పి. వీరయ్య అన్నారు. హైదరాబాద్ జిల్లాలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో అసోసియేషన్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న చిన్న, పెద్ద సమస్యలను త్వరగా పరిష్కరించుకునేందుకు ఐక్యత అవసరమని పేర్కొన్నారు. టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత స్థానిక వైద్య అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర రవీందర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్‌కు సూచించారు.

రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దాసరపు చిరంజీవి బీ2బీ ప్రైస్ లిస్టులు, సర్వీస్ విధానాలకు సంబంధించిన అంశాలను సమావేశంలో ప్రస్తావించి, వాటిపై రాష్ట్ర కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రోళ్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని ల్యాబ్ యజమానులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా అందిస్తున్న టెస్టింగ్ సర్వీసుల విషయంలో ఎదురవుతున్న సమస్యలపై సమిష్టిగా స్పందించాలని కోరారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నాగోల్ లయన్ క్లబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత సంతోష్ కుమార్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చైతన్యపురి–దిల్‌సుఖ్‌నగర్ ఎస్.ఎం. డయాగ్నోస్టిక్ సెంటర్ అధినేత షాహిద్ ఖాన్ను ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా ఇన్‌చార్జ్ టి. మధువన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అసోసియేషన్ నిర్వహించే సమావేశాలకు సభ్యులు హాజరై సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు పలువురు స్థానిక ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 88🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
69 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App