Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు.. అధ్యాపకుడిపై ఏబీవీపీ నేతల ఆగ్రహం
బ్రేకింగ్ న్యూస్

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు.. అధ్యాపకుడిపై ఏబీవీపీ నేతల ఆగ్రహం

10:41 ఉదయం AM

దేవరకొండ, ఆగస్టు 18 – అయుష్ 24 న్యూస్

దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న భాస్కర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధ్యాపకుడిపై దాడి చేసినట్లు సమాచారం.

భాస్కర్ గతంలో కూడా విద్యార్థుల పట్ల ఇదే విధంగా ప్రవర్తించేవాడని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి రోడ్డుపై నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యాబోధన చేయాల్సిన అధ్యాపకుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు పేర్కొన్నారు.

అధ్యాపకుడు భాస్కర్‌పై వెంటనే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రిన్సిపాల్ వివరణ

ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా, ఫిర్యాదు అందిందని, అధ్యాపకుడిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అధ్యాపకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధ్యాపకుడు భాస్కర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

కళాశాలను సందర్శించిన డీఏఈఓ

ఘటన విషయం తెలుసుకున్న డీఏఈఓ దస్రు నాయక్ దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థుల పట్ల అధ్యాపకుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రిన్సిపాల్‌తో చర్చించి ఘటనపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, విచారణలో వాస్తవాలు తేలిన అనంతరం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

గమనిక: అధ్యాపకుడిపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 13🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *