Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › తెలంగాణ › వెంకటాపూర్‌లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
తెలంగాణ

వెంకటాపూర్‌లో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

03:56 మధ్యాహ్నం PM

డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కె. ఉదయశ్రీ

మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ కె. ఉదయశ్రీ సూచించారు. బుధవారం మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘రమేష్ టీం’ బృందం బుర్రకథ ప్రదర్శన ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించింది.

అనంతరం మేనేజర్ కె. ఉదయశ్రీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ప్రజల ఆశ, భయాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. లోన్ యాప్‌లు, లాటరీలు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు, పాన్ కార్డ్ అప్‌డేట్, ఆధార్ లింకేజీ పేర్లతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని సూచించారు.

ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని, గూగుల్‌లో అనధికార లోన్ యాప్‌ల కోసం వెతకవద్దని కోరారు. ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు బ్యాంకులో సమర్పించాలని తెలిపారు.

రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా పంట రుణాలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, ఆయిల్ పామ్, పాలీహౌస్‌లు, ట్రాక్టర్లు, గోల్డ్ లోన్లు, స్వయం సహాయక సంఘాలు, గృహ నిర్మాణం, వ్యాపారం, విదేశీ విద్య కోసం వివిధ రకాల రుణాలు అందిస్తున్నామని వివరించారు.

సహకార బ్యాంకు డిపాజిట్లపై అత్యధికంగా 8 శాతం వడ్డీ కల్పిస్తున్నామని తెలిపారు. రూ.436తో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, రూ.20తో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన సౌకర్యాలను పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సర్పంచ్ తోట పోచయ్య, ఉపసర్పంచ్ కీర్తి సాయి, ఫీల్డ్ ఆఫీసర్ సందెబోయిన శ్రీనివాస్, ఎఫ్‌ఎల్‌సీ మోహన్ రావు, బ్యాంకు సిబ్బంది మహేశ్వరి, సహకార సంఘం సిబ్బంది నారామల్ల విద్యాసాగర్, పైడాకుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 19🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App