ఇంటిలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం నిర్వహించిన అమర్నాథ్ కుటుంబ సభ్యులు
దేవరకొండ, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్:
వినాయక చవితి సందర్భంగా ఇంటిలో ప్రతిష్ఠించిన వినాయకుడికి నాలుగు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం గురువారం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప కాలనీలో కోయల్కార్ రమేష్–యశోద దంపతుల గృహంలో ప్రతిష్ఠించిన చిన్ని గణపయ్యకు నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి కుమారుడు అమర్నాథ్ దంపతులు కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఆటపాటలు, సందడి మధ్య వినాయకుడిని ఊరేగిస్తూ భీమనపల్లి చెరువుకు చేరుకుని నిమజ్జనం నిర్వహించారు. ఉమ్మడి కుటుంబ సభ్యులంతా కలిసి కోలాహలంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడంతో కాలనీవాసులు సైతం ఆసక్తిగా తిలకించి కుటుంబ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యులంతా కలిసి విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు, చిన్నారులతో ఆనందంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు.










Leave a Reply