Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › Latest › సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
Latest

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

10:54 ఉదయం AM

మంథని, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సూచనల మేరకు మంగళవారం మంత్రి కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు మాచిడి రవితేజ గౌడ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, లింగయ్య గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి ఆరెల్లి కిరణ్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొఘల్ సామ్రాజ్య నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడని పేర్కొన్నారు.

అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం, స్వయం పాలన కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం చేశారని తెలిపారు. మొఘల్ పాలకులు విధించిన పన్నులు, ప్రజలపై సాగించిన హింసకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశారని అన్నారు.

బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటపై బహుజన జెండాను ఎగురవేసి, గోల్కొండను కేంద్రంగా చేసుకుని పరిపాలన సాగించారని నాయకులు తెలిపారు. అనేక కోటలను, సామంత రాజులను జయించి బహుజన రాజ్యాన్ని స్థాపించిన మహాయోధుడిగా సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఆ మహనీయుడి స్ఫూర్తితో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గౌడ సోదరులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *