పార్టీలకు అతీతంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అభినందనలు
దేవరకొండ: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
గుండ్లపల్లి (డిండి) మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి సర్పంచుల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన సందర్భంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో అధికారులతో సర్పంచులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అందరినీ సమన్వయం చేస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో సర్పంచులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth









Leave a Reply