Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › స్థానిక వార్తలు › సహకార సంఘ సభ్యుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత: చైర్మన్ కొత్త శ్రీనివాస్
స్థానిక వార్తలు

సహకార సంఘ సభ్యుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత: చైర్మన్ కొత్త శ్రీనివాస్

01:17 మధ్యాహ్నం PM

మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 89వ సర్వసభ్య సమావేశం

మాజీ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ మృతికి సంతాపం

మంథని, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు, రైతుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 89వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘం ద్వారా రైతులకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సకాలంలో అవసరమైన సహకారం అందించడంతో పాటు సంఘాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాలకవర్గం, సిబ్బంది, సభ్యులు సమన్వయంతో పనిచేస్తే సంఘం ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని పేర్కొన్నారు.

గత రబీ సీజన్‌లో సంఘం ఆధ్వర్యంలో 36 ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించి 5,05,585 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ విషయంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచామని శ్రీనివాస్ తెలిపారు.

ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో, జిల్లా కలెక్టర్, సహకార శాఖ అధికారుల సహకారంతో గుంజపడుగు శివారులో రూ.3.40 కోట్లతో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. దీని ద్వారా సంఘానికి రూ.51 లక్షల ఆదాయం సమకూరనుందని పేర్కొన్నారు.

ప్రస్తుత సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీలు, గోనె సంచుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతుల ధాన్యంలో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత సీజన్‌లో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.

ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా, ధాన్యంలో కోతలు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

టీజీఈఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే మాట్లాడుతూ స్వాతంత్ర్య, సహకార ఉద్యమ కాలంలో పలువురు తమ ఆస్తులు, డబ్బును వెచ్చించి సహకార సంస్థలను కాపాడారని పేర్కొన్నారు. నిర్వహణ లోపాల కారణంగా కరీంనగర్ జిల్లాలోని మెట్‌పల్లి, వావిలాల చేనేత సహకార సంఘాలు కాలక్రమంలో నిర్వీర్యమయ్యాయని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన రుణమాఫీ వంటి చర్యలు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సహకార సంఘాలు నిలదొక్కుకునేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.

సమావేశంలో సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్య సంఘం జమా ఖర్చుల వివరాలను చదివి వినిపించారు. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు చైర్మన్ కొత్త శ్రీనివాస్ సమాధానమిచ్చారు.

అంతకుముందు సంఘ మాజీ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ అకాల మృతికి సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

సమావేశంలో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాపు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, ఉడుత మాధవి-పర్వతాల్ యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ మాచిడి రాజు గౌడ్, సర్పంచులు తోటపల్లి పోచయ్య, సంగెం సరోజన-గట్టయ్య, న్యాతరి లతా-శ్రీనివాస్, గుమ్మడి సమ్మయ్య, సంధ్య-భానేష్, జాడి రామస్వామి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సంఘ మాజీ డైరెక్టర్ ఇనుముల సతీష్, నాయకులు బెజ్జంకి డిగంబర్, వేల్పుల గట్టయ్య, తిరుపతి, సబ్బని సంతోష్‌తో పాటు పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 41🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App