Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › తెలంగాణ › సామాజిక సేవతో పుట్టినరోజు వేడుకలు ఆదర్శనీయం
తెలంగాణ

సామాజిక సేవతో పుట్టినరోజు వేడుకలు ఆదర్శనీయం

01:12 మధ్యాహ్నం PM

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. మంథని సీఐ బుద్దే స్వామి అభినందనలు

మంథని: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)

పుట్టినరోజు వేడుకలను కేక్ కటింగ్‌లు, ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేదలకు అండగా నిలిచేలా నిర్వహించడం అభినందనీయమని మంథని సీఐ బుద్దే స్వామి అన్నారు. మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులు తమ కుమారుడు తాటి సాయివర్ధన్ (టిల్లు) పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సాయివర్ధన్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన ఐదు నిరుపేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. మంథని సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు. సాయివర్ధన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సాయివర్ధన్ తండ్రి తాటి విజయ్ కుమార స్వామి మాట్లాడుతూ తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లభించే తృప్తి ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

సామాజిక సేవలో ముందుండే విజయ్ కుమార స్వామి

తాటి విజయ్ కుమార స్వామి మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో రైటర్‌గా విధులు నిర్వహిస్తూ తనవంతుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. యువతకు, సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించేలా వివిధ సామాజిక అవగాహన రీల్స్ రూపొందిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. సామాజిక ప్రయోజనంతో కూడిన ఆయన రీల్స్‌కు పలువురు అభిమానులు, యువత నుంచి అభినందనలు లభిస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో తన కుమారుడి పుట్టినరోజును సేవా కార్యక్రమంగా నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో యువకులు, పోలీసు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొని సాయివర్ధన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన తాటి విజయ్ కుమార స్వామి–నిహారిక దంపతులను అభినందించారు.

అయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 56🔗 Shares: 5👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App