కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ చిత్రపటానికి నివాళులు — కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
రామగిరి, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
రామగిరి మండలం సుందిల్ల గ్రామానికి చెందిన ప్రముఖ సుందిల్ల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ చైర్మన్ కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కొరకొప్పుల సత్యనారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply