లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ డే, మెడికల్ క్యాంపుతో వేడుకలు
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించారు. లయన్స్ డిస్ట్రిక్ట్ 320ఏ బతుకమ్మ సంబరాల చైర్పర్సన్ డాక్టర్ బండారు సుజాత శేఖర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న ఏవీ కాలేజీలో లయన్స్ క్లబ్ 320ఏ, 320డీ, సీనియర్ సిటిజన్స్ ఫోరం సంయుక్తంగా సీనియర్ సిటిజన్స్ డే, మెడికల్ క్యాంపుతో పాటు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్‌గా బండారు ప్రభాకర్, పీడీజీ వ్యవహరించగా, చీఫ్ గెస్ట్‌గా డిస్ట్రిక్ట్ గవర్నర్ 320ఏ సురేష్ జగనాని, గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా లయన్ డాక్టర్ రాజగోపాల్ రెడ్డి, పీడీజీ పాల్గొన్నారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యులు, ప్రెసిడెంట్లు, మహిళలు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

డాక్టర్ బండారు సుజాత శేఖర్ ఆలపించిన గౌరమ్మ స్వాగత గీతంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు కోలాటాలు ఆడుతూ, బతుకమ్మ ఉయ్యాల పాటలు పాడుతూ సందడి చేశారు.
బతుకమ్మ సంబరాల్లో డెక్కన్ క్లబ్ అధ్యక్షులు వెంకట్, శేఖర్, సెక్రెటరీ మనీషా, కవితతో పాటు పలువురు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.
ఇలాంటి సాంస్కృతిక వేడుకలు మనిషికి మనిషికి మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేస్తాయని డాక్టర్ బండారు సుజాత శేఖర్ తెలిపారు.










Leave a Reply