Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › తాజా వార్తలు › హైదరాబాద్ పోలీస్ వ్యవస్థలో భారీ పునర్వ్యవస్థీకరణ
తాజా వార్తలు

హైదరాబాద్ పోలీస్ వ్యవస్థలో భారీ పునర్వ్యవస్థీకరణ

05:47 తెల్లవారుజాము AM

జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో మార్పులు

హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు వ్యవస్థ పనితీరును ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా పునర్వ్యవస్థీకరణ చేపడుతూ హోంశాఖ జీవో ఎంఎస్ నంబర్ 84 (G.O.Ms.No. 84) ద్వారా ఆమోదం తెలిపింది.

ఈ ఉత్తర్వుల ప్రకారం సిటీ పోలీస్ పరిధిలోని పలు జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దులను సవరించారు. మహానగర విస్తరణ, జనాభా పెరుగుదలకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పర్యవేక్షణను సులభతరం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మహానగరం వ్యాప్తంగా మొత్తం 76 ప్రాంతాలకు సంబంధించి పోలీసు పరిధులను పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధులను ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేశారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్‌కు బదిలీ చేశారు.

మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ పరిధుల్లోనూ కీలక మార్పులు చేపట్టారు. శంషాబాద్ డివిజన్‌లోని ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పేరును ‘శంషాబాద్ పీఎస్’గా మారుస్తూ పునర్వ్యవస్థీకరించారు. వీటితో పాటు రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ల పరిధులతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ ప్రాంతాల్లోని పోలీసు సరిహద్దులను కూడా పునర్విభజించారు.

ట్రాఫిక్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ వింగ్‌లలోనూ మార్పులు

పునర్వ్యవస్థీకరణను కేవలం లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లకే పరిమితం చేయకుండా ప్రత్యేక విభాగాలు, వింగ్‌ల పరిధుల్లోనూ మార్పులు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసు పరిధిలోని జోన్లు, డివిజన్లను కొత్తగా వర్గీకరించారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలో కొత్తగా జోన్లను కేటాయించారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడం, బాధితులకు వేగంగా సేవలు అందించేందుకు వీలుగా జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జీవోలో మార్గదర్శకాలు జారీ చేసింది.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 42🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App