ఇంజనీర్ల సేవలు వెలకట్టలేనివి: లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య
దేవరకొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాలతో సత్కరించారు.
జెన్కోలో పనిచేస్తున్న ఏఈడీఈ వస్కుల సత్యనారాయణ, డిస్కంలో పనిచేస్తున్న ఏడీఈ నారాయణ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ బొడ్డుపల్లి రాజేష్‌లను మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ.. దేశం గర్వించదగిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని రంగాల్లోనూ ఇంజనీర్ల సేవలు అవసరమని అన్నారు.
నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న యువ ఇంజనీర్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంజనీర్ల సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డే సందర్భంగా పురస్కారాలతో పాటు సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, ఫాస్ట్ జెడ్సీ వనం శ్రీనివాసులు, లకుమారపు మల్లయ్య, గాజుల రాజేష్, నల్లగాసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH










Leave a Reply