📰 SBIలో 9,124 ఉద్యోగాలు.. దరఖాస్తులకు త్వరలో అవకాశం
దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు SBI నోటిఫికేషన్

- AYUSH24 NEWS | ఉద్యోగ సమాచారం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 9,124 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు SBI నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నియామకాల్లో 7,680 రెగ్యులర్ పోస్టులు, 1,444 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 31 వరకు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
🎓 అర్హత
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
💰 జీతం
ఎంపికైన అభ్యర్థులకు ₹24,050 నుంచి ₹64,480 వరకు జీతం లభిస్తుంది.
📝 ఎంపిక విధానం
అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు మరియు సంబంధిత నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.
🌐 అధికారిక వెబ్సైట్
- SBI Careers – అధికారిక వెబ్సైట్
⚠️ గమనిక: దరఖాస్తు తేదీలు, అర్హతలు, పోస్టుల వివరాలను అభ్యర్థులు అధికారిక SBI నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
— AYUSH24 NEWS
The Voice of Truth

