Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › 11వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
బ్రేకింగ్ న్యూస్

11వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

11:30 ఉదయం AM

కౌన్సిలర్ ఎస్.కే. నవీద్

దేవరకొండ, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలోని 11వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని 11వ వార్డు కౌన్సిలర్ ఎస్.కే. నవీద్ తెలిపారు.

వార్డులో జరుగుతున్న సీసీ రోడ్డు మరమ్మతు పనులను కౌన్సిలర్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలిస్తూ, పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఎస్.కే. నవీద్ మాట్లాడుతూ.. “ప్రతి ఇంటి ముందూ మంచి రోడ్డు ఉండాలి.. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి” అనేదే తన సంకల్పమని తెలిపారు.

వార్డులోని ప్రతి ఇంటికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు వీధి దీపాలు, సీసీ రోడ్లు, పారిశుధ్యం, చెత్త సమస్య, తాగునీటి సౌకర్యం వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ప్రజలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. వార్డులో ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

“ప్రజల సేవే నా బాధ్యత.. వార్డు అభివృద్ధే నా ధ్యేయం” అని కౌన్సిలర్ ఎస్.కే. నవీద్ పేర్కొన్నారు.

ఎస్.కే. నవీద్
11వ వార్డు కౌన్సిలర్
కాంగ్రెస్ పార్టీ | దేవరకొండ

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *