భక్తితో పాల్గొని మహా ప్రసాదాన్ని సొంతం చేసుకున్న చిన్నారి
భక్తి, ఐక్యత, సోదరభావానికి ప్రతీకగా గణనాథుడి ఉత్సవాలు
దేవరకొండ, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో ఈశ్వర పుత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన భారీ గణనాథుడి 14 కిలోల మహా లడ్డూ డ్రా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ డ్రాలో దేవరకొండ పట్టణానికి చెందిన చిన్నారి ముసిని సహస్ర విజేతగా నిలిచి గణనాథుడి మహా ప్రసాదాన్ని దక్కించుకున్నారు.
సహస్ర సీనియర్ రిపోర్టర్ ముసిని అంజన్ కుమార్తె. గణనాథుడి ఆశీస్సులతో లభించిన మహా ప్రసాదాన్ని భక్తితో స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని సహస్ర కుటుంబ సభ్యులు తెలిపారు.
“లడ్డూ గెలుపు కంటే.. గణనాథుడి ఆశీస్సులే గొప్ప విజయం” అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
గణనాథుడి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక వేడుకలకే పరిమితం కాకుండా భక్తి, ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తిని పెంపొందించే వేదికలుగా నిలవాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. యువతను సన్మార్గంలో నడిపిస్తూ సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ఉత్సవాల ప్రధాన సందేశమని పేర్కొన్నారు.
14 కిలోల గణనాథుడి మహా లడ్డూ డ్రాలో విజేతగా నిలిచిన ముసిని సహస్రకు నిర్వాహకులు, భక్తులు అభినందనలు తెలిపారు.









Leave a Reply