సంగారెడ్డి ‘దువా’ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స
సంగారెడ్డి, సెప్టెంబర్ 20 (ప్రతినిధి):
సంగారెడ్డి బండ్లగూడలోని ‘దువా’ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కావలి మండలం తునికి గ్రామానికి చెందిన ఓ మహిళ కడుపులో ఉన్న భారీ కణితిని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.
శనివారం సదరు మహిళ వైద్యులను సంప్రదించగా, వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఆమె కడుపులో సుమారు 4.5 కిలోల బరువున్న కణితి (ఓవేరియన్ సిస్ట్) ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి సుమారు 4.5 కిలోల బరువున్న కణితిని విజయవంతంగా తొలగించారు.
ఈ శస్త్రచికిత్సను డాక్టర్ కిరణ్ కుమార్, జనరల్ సర్జన్, డాక్టర్ రేష్మ అంజుమ్ తదితర వైద్య నిపుణులు నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.










Leave a Reply