Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › 5 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. స్మరణి రాజ్ అద్భుత ఘనత
బ్రేకింగ్ న్యూస్

5 ఏళ్లకే ప్రపంచ రికార్డు.. స్మరణి రాజ్ అద్భుత ఘనత

02:10 మధ్యాహ్నం PM

1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో స్పీడ్ పంచింగ్, స్పీడ్ కికింగ్‌లో సత్తా

హైదరాబాద్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్:
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 1వ వరల్డ్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్లో కేవలం 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారి స్మరణి రాజ్ అద్భుత ప్రతిభ కనబరిచి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

రికార్డు ఈవెంట్‌లో స్మరణి రాజ్ 1 నిమిషంలో 200 స్పీడ్ పంచ్‌లు, 1 నిమిషంలో 100 స్పీడ్ కిక్‌లు విజయవంతంగా చేసి అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. ఈ ఘనతకు గుర్తింపుగా ఆమెకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు, గోల్డ్ మెడల్ అందజేశారు.

ఈ సందర్భంగా హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్ తెలంగాణ హెడ్ సుమన్, అమికల్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వీణా వాహిని, జేఆర్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి చిన్నారి స్మరణి రాజ్‌ను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.

ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో జాంబియా, ఇథియోపియా, మారిషస్, జపాన్, శ్రీలంక, నేపాల్, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కలిపి మొత్తం 12 దేశాల నుంచి, అలాగే భారతదేశంలోని 22 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.

కేవలం ఐదేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డు సాధించిన స్మరణి రాజ్‌ను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

స్మరణి రాజ్‌కు అయుష్ 24 న్యూస్ తరఫున హృదయపూర్వక అభినందనలు. 🥋🏆🇮🇳

జై హింద్! 🇮🇳

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *