Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › దేవరకొండ › నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలి
దేవరకొండ

నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలి

08:23 ఉదయం AM

మైనంపల్లి, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

నీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని మైనంపల్లి గ్రామ సర్పంచ్ రాంసింగ్ నాయక్ కోరారు. సోమవారం మైనంపల్లి గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాంసింగ్ నాయక్ మాట్లాడుతూ, నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు విద్యుత్‌ను అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గ్రామ ప్రజలను కోరారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వినియోగం, విద్యుత్ పొదుపు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు, విద్యుత్ సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఉప సర్పంచ్ లాలూ నాయక్, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అభిలాష్, పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, వార్డు సభ్యుడు నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ వెంకట్, ఫీల్డ్ అసిస్టెంట్ అమరెందర్, ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు కమలమ్మ, లచ్చి, బుజ్జి, ఏఎన్‌ఎం విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 17🔗 Shares: 2👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App