Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’● దేవరకొండ ఏబీవీపీ నూతన నగర కార్యవర్గం ప్రకటన ​విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏబీవీపీ ధ్యేయం: రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చత్రపతి చౌహన్● నల్లగొండలో నవంబర్ 2న బిఎల్‌ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం: నూనె వెంకట్ స్వామి● చందంపేటలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభం● జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హాలియా విద్యార్థుల పతకాల పంట● సమతుల్యంగా ఎరువులు వాడితే నాణ్యమైన దిగుబడులు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● మల్లెపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● దేవరకొండ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ‘ప్రతిభా వికాసం’
Home › తాజా వార్తలు › మాతా శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి – మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి
తాజా వార్తలు

మాతా శిశు సేవలను సద్వినియోగం చేసుకోండి – మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి

08:38 ఉదయం AM

మంథని | 05-08-2026

మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నేడు గైనకాలజిస్ట్ డా. మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డా. గుంట మౌనిక, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డా. చిలకలపల్లి నరేష్ ఆధ్వర్యంలో రెండు సిజేరియన్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సల ద్వారా ఒక బాబు, ఒక పాప జన్మించగా, తల్లి–బిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా మంథని ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. టీ.వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రెగ్యులర్ వైద్యులను నియమించడం వల్ల మంథని ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలు, చిన్నారులకు ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.

ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొంటూ, ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రికి సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా సూచనలు ఉంటే నేరుగా మెడికల్ సూపరింటెండెంట్‌ను 98858 08589 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నందుకు గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలపగా, మంథని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

🖋️ AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 3🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
680 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App