Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు● రైతులకు అండగా సీసీఐ కొనుగోలు కేంద్రం.. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
Home › తాజా వార్తలు › తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌కు ఘన నివాళులు
తాజా వార్తలు

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌కు ఘన నివాళులు

04:45 సాయంత్రం PM

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

హైదరాబాద్ | AYUSH24 NEWS

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణ సమాజానికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి రమావత్ రవీంద్ర కుమార్ కూడా పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఆచార్య జయశంకర్ ఆశయాలను అనుసరించాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.

— AYUSH24 NEWS

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 1🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
672 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App