Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కొండమల్లేపల్లి వార్డు సభ్యులు సెక్రటరీపై ప్రజావాణిలో ఫిర్యాదు
బ్రేకింగ్ న్యూస్

కొండమల్లేపల్లి వార్డు సభ్యులు సెక్రటరీపై ప్రజావాణిలో ఫిర్యాదు

11:56 ఉదయం AM

కొండమల్లేపల్లి, ఆగస్టు 17: కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వార్డు సభ్యులు బూడిద మంజుల, మల్లేష్, ఎలిమినేటి సాయి, శంకర్ గౌడ్ సోమవారం కొండమల్లేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ తమ వార్డుల్లో విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు వినతులు అందించినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.అలాగే ఆగస్టు 15న నిర్వహించిన గ్రామసభను తూతూమంత్రంగా నిర్వహించారని, దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర గ్రామపంచాయతీకి రావాల్సిన పన్నులను బిల్ కలెక్టర్లు వసూలు చేసిన రోజే ఎస్‌టీఓలో జమ చేయాల్సి ఉండగా, వసూలైన మొత్తాలను 10 నుంచి 15 రోజుల వరకు వ్యక్తిగత అవసరాలకు వినియోగించి అనంతరం జమ చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్, చెత్త సేకరణ వాహనాలు, ట్యాంకర్లను సొంత పనులకు, కాంట్రాక్టు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

పంచాయతీ సిబ్బంది సర్పంచ్ ఆదేశాలను పాటించకపోతే గైర్హాజరు నమోదు చేసి జీతాలు నిలిపివేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.14 వార్డులకు నిష్పక్షపాతంగా సేవలందించాల్సిన గ్రామ కార్యదర్శి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చగా మారుతుందని వారు పేర్కొన్నారు.ప్రజావాణిలో అందించిన ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, ఆరోపణలపై న్యాయపరమైన విచారణ జరిపి, బాధ్యులపై ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు అధికారులను కోరారు.

— అయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 2🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *