Tuesday, 15 Sep 2026
15 Sep 2026Tuesday
Home   Reporter Profile
🔴 BREAKING
ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన ప్రధమ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ వద్ద కారు బోల్తా.. నలుగురికి గాయాలు గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ – స్టార్ కిడ్ అవార్డ్స్ విజేతలకు ఘన సన్మానం భక్తిశ్రద్ధలతో గణనాథునికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్నిటికైనా దిగజారుతారు: పుట్ట మధూకర్ పడమటిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన
Home › బ్రేకింగ్ న్యూస్ › కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ
బ్రేకింగ్ న్యూస్

కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ

11:39 ఉదయం AM

టేకులపల్లి, ఆగస్టు 18, అయుష్ 24 న్యూస్: టేకులపల్లి మండలంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి, మెనూ గురించి విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యాబోధన, పాఠశాల పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే ప్రధాన పునాది అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

ఎమ్మెల్యే ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి విద్యార్థుల పరిస్థితులు, వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
732 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *