Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › గిరిజన కుటుంబం ఇల్లు కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి
బ్రేకింగ్ న్యూస్

గిరిజన కుటుంబం ఇల్లు కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి

04:06 సాయంత్రం PM

ఫారెస్ట్‌, పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌, వ్యకాస డిమాండ్‌

బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి: ఉప్పలి మల్కయ్య

యాలాల, సెప్టెంబర్‌ 3 | అయుష్ 24 న్యూస్

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం బొంరాస్‌పేట్‌ మండల పరిధిలో గిరిజన కుటుంబం నిర్మించుకుంటున్న ఇంటిని అటవీ, పోలీసు అధికారులు జేసీబీలతో కూల్చివేశారంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌, వ్యకాస నాయకులు డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు గురువారం యాలాల మండల కేంద్రంలో విడుదల చేసిన ప్రకటనలో కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యకాస జిల్లా అధ్యక్షుడు యు. బుగ్గప్ప మాట్లాడారు.

వారి ప్రకారం.. బొంరాస్‌పేట్‌ మండలంలోని ఎనిమితండా పంచాయతీ పరిధిలోని ఊరేంటి తండాలో హరిచంద్ర నాయక్‌ కుటుంబానికి చెందిన రవి నాయక్‌, రాము నాయక్‌ నూతన ఇంటి నిర్మాణం చేపట్టారని తెలిపారు. సుమారు 200 గజాల స్థలంలో 16 పిల్లర్లతో నిర్మిస్తున్న ఇల్లు స్లాబ్‌ దశకు చేరుకున్న సమయంలో పోలీసు, అటవీ శాఖ అధికారులు జేసీబీలతో కూల్చివేశారని ఆరోపించారు.

ఇంటి నిర్మాణాన్ని కూల్చివేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. బాధిత గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నిబంధనల ప్రకారం రూ.50 లక్షల పరిహారం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధిగా ఈ ఘటనపై ప్రత్యేకంగా స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేయాలని కోరారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. సెప్టెంబర్‌ 4న ముఖ్యమంత్రి కొడంగల్‌ పర్యటన సందర్భంగా నిరసన చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.

— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 4🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *