షాద్‌నగర్ న్యూ పవర్ కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులకు అభినందనలు
షాద్‌నగర్, సెప్టెంబర్ 14 | AYUSH24 NEWS ప్రతినిధి:
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026లో ప్రతిభ కనబరిచి స్టార్ కిడ్ అవార్డ్స్ సాధించిన షాద్‌నగర్‌కు చెందిన న్యూ పవర్ కుంగ్‌ఫూ అకాడమీ విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
అవార్డు విజేతలైన పిట్టల సంతోష్ ముదిరాజ్ కుమారుడు పిట్టల రక్షిత్ ముదిరాజ్, పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ కుమారుడు పిట్టల చరణ్ తేజ్ ముదిరాజ్లను 22వ వార్డు కౌన్సిలర్ నడికూడ అనిత రఘునాథ్ యాదవ్, బీసీ రాష్ట్ర నాయకుడు ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ సమక్షంలో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే, కుంగ్‌ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ సాధన ద్వారా ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు, క్రమశిక్షణ, ఏకాగ్రత, శారీరక దారుఢ్యం మెరుగుపడుతాయని పేర్కొన్నారు.
న్యూ పవర్ కుంగ్‌ఫూ అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణ పొందుతూ ప్రతిభను చాటుతున్నారని వారు ప్రశంసించారు. భవిష్యత్‌లో కూడా విద్యార్థులు కుంగ్‌ఫూలో మరిన్ని అవార్డులు, సర్టిఫికెట్లు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అవార్డులు సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
AYUSH24 NEWS
నిజమైన సమాచారం • నిష్పక్షపాత వార్తలు









Leave a Reply