Thursday, 29 Oct 2026
29 Oct 2026Thursday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ● దేవరకొండ సంజీవని ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స● కుంచం శ్రీను మృతి కుటుంబానికి తీరని లోటు: డా. దూదిపాల వేణుధర్ రెడ్డి● మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట● ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి● రేపు దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే బాలు నాయక్● మల్లేపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం● నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్య సంరక్షణ
Home › బ్రేకింగ్ న్యూస్ › 📰 లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
బ్రేకింగ్ న్యూస్

📰 లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

03:38 మధ్యాహ్నం PM

ఇంజనీర్ల సేవలు వెలకట్టలేనివి: లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య

దేవరకొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్

దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాలతో సత్కరించారు.

జెన్కోలో పనిచేస్తున్న ఏఈడీఈ వస్కుల సత్యనారాయణ, డిస్కంలో పనిచేస్తున్న ఏడీఈ నారాయణ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ బొడ్డుపల్లి రాజేష్లను మంగళవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ.. దేశం గర్వించదగిన ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, అన్ని రంగాల్లోనూ ఇంజనీర్ల సేవలు అవసరమని అన్నారు.

నేటి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న యువ ఇంజనీర్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంజనీర్ల సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డే సందర్భంగా పురస్కారాలతో పాటు సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, ఫాస్ట్ జెడ్‌సీ వనం శ్రీనివాసులు, లకుమారపు మల్లయ్య, గాజుల రాజేష్, నల్లగాసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

– అయుష్ 24 న్యూస్
THE VOICE OF TRUTH

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 90🔗 Shares: 6👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
225 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App