ఈ నెల 17, 18 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ఎంపిక పోటీలు
కొత్తగూడెం | సెప్టెంబర్ 15 | AYUSH24 NEWS ప్రతినిధి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక చేసేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కాశీ హుస్సేన్ తెలిపారు.
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఎంపిక పోటీలకు ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాలకు చెందిన బాలబాలికలు హాజరుకావచ్చని ఆయన తెలిపారు.
అర్హత
2008, 2009, 2010 సంవత్సరాల్లో జన్మించిన క్రీడాకారులు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు.
బరువు కేటగిరీలు
బాలుర ఫ్రీ స్టైల్:
51, 55, 60, 65, 71, 80, 92 కేజీలు
బాలుర గ్రీకో–రోమన్ స్టైల్:
51, 55, 60, 65, 71, 80, 92 కేజీలు
బాలికల ఫ్రీ స్టైల్:
46, 49, 53, 57, 61, 65, 69 కేజీలు
పై బరువు విభాగాల్లో క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొనవచ్చని కాశీ హుస్సేన్ తెలిపారు.
తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు
ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ఫోటోలు వెంట తీసుకురావాలని సూచించారు.
క్రీడాకారులు ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో హాజరు కావాలని జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కాశీ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు.
— AYUSH24 NEWS










Leave a Reply