ఆపరేషన్ నిమిత్తం ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత
విజేత. దేవరకొండ
దేవరకొండ స్థానిక పట్టణంలో నివసించే
దామెర రమేష్ భార్య పద్మ కు కడుపులో గడ్డ ఏర్పడటంతో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న డాక్టర్ నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ మానవతా దృక్పథంతో స్పందించి, ఆమె ఆపరేషన్ నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేసింది ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు నక్కా సత్యవతి స్వయంగా ఆర్థిక సహాయాన్ని పద్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు నక్క వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు యాదవ్, నక్క మహేష్ యాదవ్, పుల్కారం గణేష్, బొమ్ము తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా ఆత్మీయతతో సహాయంగా
డాక్టర్ నక్క అఖిలేష్ యాదవ్ ఫౌండేషన్ దేవరకొండ











Leave a Reply