మంథని, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
మంథనిలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు మంథని మండల అధ్యక్షుడు ఏ. గోలపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మంథనిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.










Leave a Reply