చందంపేట, సెప్టెంబర్ 22:
చందంపేట మండలం అచ్చంపేట పట్టి గ్రామపంచాయతీ పరిధిలోని సంధ్య తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జర్పుల భధ్యా నాయక్ తండ్రి, మాజీ వార్డు మెంబర్ సోమ్లా నాయక్ మృతి చెందారు.
సోమ్లా నాయక్ మృతి విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మంగళవారం సంధ్య తండాలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సోమ్లా నాయక్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జర్పుల భధ్యా నాయక్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని, ఎలాంటి అవసరం వచ్చినా తోడుగా నిలుస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ భరోసా ఇచ్చారు.
సోమ్లా నాయక్ మృతి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
పలువురు నాయకులు, కార్యకర్తల హాజరు:
ఈ కార్యక్రమంలో ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, ఏడుపుల గోవిందు యాదవ్, దొండేటి మల్లారెడ్డి, కిన్నెర హరికృష్ణ, వాంకునావత్ బిక్కు నాయక్, సాదిక్, గోసుల అనంతగిరి, లచ్చిరాం నాయక్, రంగయ్య గౌడ్, మహాలక్ష్మయ్య, మున్నయ్య యాదవ్, ఉమామహేశ్వర్, వంశీ, కరిమోద్దీన్, రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
— Ayush 24 News
The Voice of Truth
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జర్పుల భధ్యా నాయక్ తండ్రి సోమ్లా నాయక్ మృతి , భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బాలు నాయక్
చందంపేట, సెప్టెంబర్ 22: చందంపేట మండలం అచ్చంపేట పట్టి గ్రామపంచాయతీ పరిధిలోని సంధ్య తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జర్పుల భధ్యా నాయక్ తండ్రి, మాజీ వార్డు మెంబర్ సోమ్లా నాయక్ మృతి చెందారు. సోమ్లా నాయక్ మృతి విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply