మంథని, సెప్టెంబర్ 22 (ప్రతినిధి): మంథని నియోజకవర్గంలోని కాకర్లపల్లి గ్రామంలో మంగళవారం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన కుటుంబాలకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గతంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పనిచేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని వారు పేర్కొన్నారు.
కాకర్లపల్లి గ్రామంలో అర్హులైన కుటుంబాలకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలు ఉన్నాయని నాయకులు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన కుటుంబాలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఆరెల్లి కిరణ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనబోయిన ఓదెలు, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఆకుల ప్రత్యూష సాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండే రాజయ్య, తన్నీరు లక్ష్మణ్, సీనియర్ నాయకులు ఎలాకుచ్చు, కత్తెరశాల పర్షవేన రాజయ్య, వార్డు సభ్యులు మెదరవేన రాము, మబ్బు తిరుపతి, యూత్ అధ్యక్షుడు ఎలగందుల వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు చెవుల బాపు, నల్లి లక్ష్మణ్, నాయకులు ఇసంపల్లి మధుకర్, ఆకుల స్వామి, మంథని సాగర్, రుద్రారం ఎంకన్న, రేషన్ డీలర్ పద్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










Leave a Reply