దేవరకొండ, సెప్టెంబర్ 22:
డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చింతలపల్లి రిజర్వాయర్ భూసేకరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అధికారులను కోరారు.
మంగళవారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, భూసేకరణ, రెవెన్యూ అధికారులతో పాటు చింతలపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న చింతపల్లి, నసర్లపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల రైతులతో ఎమ్మెల్యే బాలు నాయక్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిజర్వాయర్ భూసేకరణకు సంబంధించిన పురోగతిని అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, అర్హులైన రైతులకు పరిహారం చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వనజా రాణి, లీల, చింతపల్లి తహసీల్దార్ విజయలక్ష్మి, ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, మూడు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
– Ayush 24 News
చింతలపల్లి రిజర్వాయర్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
దేవరకొండ, సెప్టెంబర్ 22: డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చింతలపల్లి రిజర్వాయర్ భూసేకరణ పనులను వేగవంతం చేయడంతో పాటు, భూములు కోల్పోతున్న రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అధికారులను కోరారు. మంగళవారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply