ఉత్తమ సేవలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
దేవరకొండ, సెప్టెంబర్ 5 (ప్రతినిధి):
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. ఇందులో దేవరకొండ కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఊర సావిత్రి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై అవార్డును అందుకున్నారు.
ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను గుర్తించి అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల్లో భాగంగా సావిత్రిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఈఓ తదితర అధికారులు ఆమెకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి సన్మానించారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఊర సావిత్రి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పురస్కారంతో తన బాధ్యత మరింత పెరిగిందని, విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉన్నతి కోసం తనతోటి ఉపాధ్యాయినీలతో కలిసి మరింత కృషి చేస్తానని తెలిపారు.
తనను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసి ప్రోత్సహించిన జిల్లా మంత్రి, దేవరకొండ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, డీఈఓ, ఎస్పీతో పాటు జిల్లా అధికారులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న ఊర సావిత్రిని కేజీబీవీ పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు అభినందించారు.










Leave a Reply