గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
దేవరకొండ మండల పరిధిలోని చింతబాయి, దేవరకొండ-4 జంగాల కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాహారం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై మహిళలు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ నిర్మల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన సిరిధాన్యాలు, చిరుధాన్యాలతో పాటు స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

సూపర్వైజర్ ఎం. విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహారంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వర్షాకాలంలో వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అవసరమని పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం అందించడంతో పాటు తక్కువ బరువు ఉన్న చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, ప్రభావతి, ఆయాలు వెంకటమ్మ, వరమ్మ, తల్లులు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply