అంతర్జాతీయ విద్యా విధానాలు, బోధనా పద్ధతుల పరిశీలనకు అవకాశం
మంథని, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): మంథని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు గీత్ల భారత్రెడ్డి వియత్నాం విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. ఆయన ఎంపికపై స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్న భారత్రెడ్డి విద్యారంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గతంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జాబితాలోనూ స్థానం పొందారు.
వియత్నాం విద్యా పర్యటనలో భాగంగా అక్కడి విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలను పరిశీలించే అవకాశం ఆయనకు లభించనుంది. పర్యటనలో పొందిన అనుభవాలు, నూతన బోధనా విధానాలను భవిష్యత్తులో విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని విద్యాభిమానులు పేర్కొన్నారు.
మంథని ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపిక కావడంపై పలువురు అభినందనలు తెలిపారు.










Leave a Reply