దేశభక్తి భావంతో గీతాన్ని ఆలపించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
మంథని, సెప్టెంబర్ 25 (ప్రతినిధి): విద్యా భారతి న్యూఢిల్లీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో భాగంగా మంథనిలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం టెక్నో హైస్కూల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
పాఠశాల కోఆర్డినేటర్ కనుకుంట్ల స్వామీజీ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశభక్తి భావంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పాఠశాల కరస్పాండెంట్ ప్రదీప్ రెడ్డికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ మేడగొని రాజమౌళి గౌడ్ సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.










Leave a Reply