2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్యాలతో మొత్తం 9 పతకాలు
హైదరాబాద్: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
కేఎల్బీ కప్ ఓపెన్ నేషనల్ తైక్వాండో ఛాంపియన్షిప్–2026లో నేషనల్ అకాడమీ ఫర్ డ్యాన్స్ మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ అండ్ సైన్స్ అసోసియేషన్ (NADMFSA) విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొత్తం 9 పతకాలు సాధించారు. సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ జి. విజయ్ కుమార్ మార్గదర్శకత్వంలో పాల్గొన్న క్రీడాకారులు క్యోరుగి, పూమ్సే విభాగాల్లో 2 స్వర్ణ, 3 రజత, 4 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.
క్యోరుగి విభాగంలో కె. హేషంత్ స్వర్ణ పతకం సాధించగా, పూమ్సే విభాగంలో గుర్రం అపూర్వ్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు.

పూమ్సే విభాగంలో జీయా ప్రదీప్ ముండ్కర్ రజత పతకం సాధించగా, క్యోరుగి విభాగంలో ప్రణవ్ ముకుంద, అనికా శర్మ రజత పతకాలు సాధించారు.
క్యోరుగి విభాగంలో ఆర్. ధనశ్రీ, వి. రితిక్ రెడ్డి కాంస్య పతకాలు సాధించగా, పూమ్సే విభాగంలో అదివిక్ సింగ్, పి. శశివర్ధన్ రెడ్డి కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
పతక విజేతలకు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి చేతుల మీదుగా పతకాలు అందజేశారు. ఛాంపియన్షిప్ నిర్వాహకుడిగా హనుమంతు వ్యవహరించినట్లు NADMFSA తెలిపింది.
విద్యార్థుల క్రమశిక్షణ, నిరంతర సాధన, అంకితభావం ఈ విజయానికి దోహదపడ్డాయని డాక్టర్ జి. విజయ్ కుమార్ పేర్కొన్నారు. పతక విజేతలను అభినందిస్తూ, విద్యార్థుల క్రీడా ప్రయాణానికి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు ఈ విజయాలు విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని అకాడమీ పేర్కొంది.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply