కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
దేవరకొండ: దేవరకొండ మండలం పడ్మట్పల్లి గ్రామానికి చెందిన రెడ్డి బుక్ సెంటర్ నిర్వాహకుడు పల్లా శ్రీనివాస్ రెడ్డి తండ్రి పల్లా జంగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ బుధవారం పడ్మట్పల్లి గ్రామానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పల్లా జంగారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పల్లా జంగారెడ్డి మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు తీరని లోటని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి కుటుంబానికి తన సానుభూతి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఎమ్మెల్యే వెంట మారుపాకుల సురేష్ గౌడ్, దొండేటి మల్లారెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని పల్లా జంగారెడ్డికి నివాళులర్పించారు.
— Ayush 24 News
The Voice of Truth
పల్లా జంగారెడ్డి మృతదేహానికి ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళులు
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దేవరకొండ: దేవరకొండ మండలం పడ్మట్పల్లి గ్రామానికి చెందిన రెడ్డి బుక్ సెంటర్ నిర్వాహకుడు పల్లా శ్రీనివాస్ రెడ్డి తండ్రి పల్లా జంగారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ బుధవారం


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply