Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › దేవరకొండ › ఉర్దూ మీడియం పాఠశాల రోడ్డుపై మురుగు నీరు
దేవరకొండ

ఉర్దూ మీడియం పాఠశాల రోడ్డుపై మురుగు నీరు

04:02 సాయంత్రం PM

సమస్యను పరిష్కరించాలని కోరుతున్న కాలనీవాసులు — చర్యలు చేపడతామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్ వెల్లడి

దేవరకొండ, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

దేవరకొండ పట్టణంలోని 15వ వార్డులో ఉన్న ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల ఎదురుగా రోడ్డుపై వర్షపు నీరు, మురుగు నీరు నిలిచి దుర్గంధభరితంగా మారుతోందని పాఠశాల ఉపాధ్యాయులు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ మురికి నీటిని దాటుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, ఉపాధ్యాయులతో పాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వర్షం కురిసిన సమయంలో నీరు ఓపెన్ డ్రైనేజీల్లోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో రోడ్డుపైనే నిలిచి బురదగా మారుతోందని కాలనీవాసులు పేర్కొన్నారు. నిల్వ నీటితో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ నీరు తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం, శాశ్వత పరిష్కారం చేపట్టడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సమస్య రోజురోజుకూ జటిలంగా మారుతోందని, నిల్వ నీటిలో దోమలు పెరిగితే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల ముప్పు ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

పట్టణ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఇదే వార్డుకు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారని, పాఠశాల వద్ద నెలకొన్న సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని మున్సిపల్ అధికారులపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల రోడ్డుపై నిలుస్తున్న నీటిని తొలగించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

చర్యలు చేపడతాం: శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్

ఉర్దూ మీడియం పాఠశాల వద్ద వర్షపు నీరు నిలిచి దుర్గంధభరితంగా మారుతోందనే ఫిర్యాదు తనకు అందిందని శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ గౌడ్ తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 67🔗 Shares: 5👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App