Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › మరో రెండు రోజుల్లో మంథని వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు
బ్రేకింగ్ న్యూస్

మరో రెండు రోజుల్లో మంథని వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు

04:18 సాయంత్రం PM

ఏడాదిలోపు పూర్తి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్

మంథని (ఆయుష్ 24 న్యూస్): మంథని పట్టణంలో నూతన వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను మరో రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు, కూరగాయల వ్యాపారులకు సౌకర్యవంతంగా ఆధునిక వసతులతో మార్కెట్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి ఆయన మార్కెట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. మున్సిపల్ శాఖ సాంకేతిక ఆమోదం పొందిన నిర్మాణ ప్రణాళికను పరిశీలించి, పనులకు సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణంపై అపోహలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యుడు పెంటరి రాజు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 53🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App