దేవరకొండ / తుంగతుర్తి, ఆయుష్ 24 న్యూస్:
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐసీసీ (AICC) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, తుంగతుర్తి ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీకి పయనమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడంతో పాటు ప్రజల హక్కుల పరిరక్షణ, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజల గొంతుకను వినిపించడం, ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని వారు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
దేవరకొండ / తుంగతుర్తి, ఆయుష్ 24 న్యూస్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐసీసీ (AICC) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply