హైదరాబాద్, ఆయుష్ 24 న్యూస్: ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్–2026’లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం, నూతన పరిశ్రమల స్థాపనకు అవకాశాలు కల్పించడం, వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ మరింత కీలక పాత్ర పోషించేలా పారిశ్రామిక రంగం, ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్‌లో ఐటీ, సాంకేతిక రంగాలను మరింత విస్తరించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తయారీ రంగం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తో పాటు కృత్రిమ మేధ (ఏఐ), ఏరోస్పేస్, రక్షణ రంగం, అధునాతన తయారీ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకు, ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న సంస్థలకు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
— ఆయుష్ 24 న్యూస్
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి: మంత్రి శ్రీధర్ బాబు ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కండి
హైదరాబాద్, ఆయుష్ 24 న్యూస్: ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్–2026’లో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply