హనుమకొండ, ఆయుష్ 24 న్యూస్:
మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి, రైతుల పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమకొండలోని TGNPDCL సీఎండీ శ్రీ వరుణ్ రెడ్డి, IAS గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను నాయకులు సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేసి, పంటలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన సీఎండీ వరుణ్ రెడ్డి.. విద్యుత్ సరఫరా మెరుగుపరిచి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు సైతం ఈ అంశంపై నిరంతరం సూచనలు చేస్తున్నారని సీఎండీ పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలని వినతి
హనుమకొండ, ఆయుష్ 24 న్యూస్: మంథని నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి, రైతుల పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమకొండలోని TGNPDCL సీఎండీ శ్రీ వరుణ్ రెడ్డి, IAS గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్యుత్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply