దుర్గామాత
మండపం వద్ద మహా అన్నదానం
దుర్గామాతను దర్శించుకున్న
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్
విజేత. దేవరకొండ
దేవరకొండ పట్టణంలోని ఆరో వార్డు చంద్రగిరి కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గ మాత మండపం వద్ద శనివారం మహా అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు కాలనీకి చెందిన భక్తులు, కమిటీ సభ్యులు కలిసి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు కాలనీ పెద్దలు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మండపం కమిటీ సభ్యులు మైనంపల్లి శ్రీను.
గుండాల అంజి యాదవ్. గుండాల సంతోష్. ఎర్ర ఆంజనేయులు. భీమనపల్లి బాలకృష్ణ. గంజి పవన్ కుమార్. మహేష్ యాదవ్. భక్తులు తదితరులు పాల్గొన్నారు











Leave a Reply