సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి
దేవరకొండ ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి
ఎల్ ని ఓ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్ల నరసింహారెడ్డి అన్నారు.
సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం దేవరకొండ తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎల్ ని ఓ ప్రభావంతో వేసిన పంటలు ఎండిపోయాయని గ్రామాలలో సాగునీరు త్రాగు నీరు సౌకర్యలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాశ్వత సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని సకాలంలో వర్షాలు కురవక బోరు బావులు అడుగంటి పోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయక నిధులు విడుదల చేయాలని పంటలు కోల్పోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించడం తో పాటు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు గ్రామీణ పేదలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని వరికి 40,000 పత్తికి 50,000 నష్టపరిహారం చెల్లించాలని పశువులకు పసు గ్రాసం సరఫరా చేయాలని కౌలు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు సరఫరా చేయాలని గ్రామాలలో త్రాగినీటి ఎద్దడి లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి కూలీలకు కూలి రేట్లు పెంచాలని జాబు కార్డు కలిగిన కుటుంబానికి తగిన పని దినాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి దేప సుదర్శన్ రెడ్డి ,సహాయ కార్యదర్శి నూనె రామస్వామి, పల్ల రంగారెడ్డి, జూలూరు వెంకట రాములు, గంగిడి రాంరెడ్డి, కిన్నెర యాదయ్య, ఆలమొని మల్లయ్య ,భారీములు పర్వతాలు ,రామకృష్ణ, గోవర్ధన్, అంజయ్య, పుల్లయ్య, శీను తదితరులు పాల్గొన్నారు










Leave a Reply