ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ
దేవరకొండ, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ–లెఫ్ట్ యూనిటీ విజయం సాధించిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై బాణసంచా కాల్చగా, కళాశాల కమిటీ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల హక్కులు, విద్యారంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ–లెఫ్ట్ యూనిటీకి విద్యార్థులు మద్దతు ఇచ్చి విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
విద్యార్థుల గొంతుకగా నిలిచే సంఘాలకు విద్యార్థులు మద్దతు ఇస్తున్నారని, HCU ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనమని బుడిగ వెంకటేష్ అన్నారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నేతళ్ళ జైరాం, ఎ. పరమేష్, పి. రాకేష్, డీ. చరణ్, ఆర్. యశ్వంత్, నందీశ్వర్, అశోక్, గాబర్సింగ్, శ్రీకాంత్, పూమియా, సిద్ధూ, హరీష్వ, శివ తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply