దేవరకొండ, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): TGTWURJC COE (Girls), దేవరకొండ, నల్గొండ జిల్లా కళాశాల విద్యార్థిని ఆర్. నిఖిత MBBS సీటు సాధించిన సందర్భంగా కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవనీయులైన సెక్రటరీ మేడం మరియు శ్రీ రామారావు సర్ నిఖితను ఘనంగా సన్మానించి, ఆమెను అభినందించారు. MBBS సీటు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలిచిన నిఖితకు వారు శుభాకాంక్షలు తెలిపారు.
నిఖిత సాధించిన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తులో వైద్య రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
హృదయపూర్వక అభినందనలు నిఖిత! 💐🎓🩺
– ప్రిన్సిపాల్ & సిబ్బంది
TGTWURJC COE (Girls), దేవరకొండ
నల్గొండ జిల్లా










Leave a Reply